- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విడాకులు తీసుకోబోతున్న మరో స్టార్ కపుల్.. ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన హీరో భార్య!
దిశ, సినిమా: ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి సినీ సెలబ్రిటీల విడాకుల వార్తలు మార్మోగిపోతున్నాయి. కొంతమంది జంటలు విడాకులను అధికారికంగా ప్రకటిస్తే.. మరికొందరు మాత్రం ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది స్టార్ కపుల్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ విడాకులు తీసుకుని విడిపోయి విడివిడిగా జీవిస్తున్నారు. అలాగే కొందరు పెళ్లై పిల్లల ఉన్నప్పటికీ విడాకులు తీసుకోవడానికి సంకోచించడం లేదు. ఇండస్ట్రీలో ఈ మధ్య కొందరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాక అధికారికంగా ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలో విడాకుల పుకార్లు ఎక్కువయ్యాయి. తాజాగా, ఓ స్టార్ కపుల్ విడాకుల వార్తలు జోరందుకున్నాయి. కోలీవుడ్ హీరో జయం రవి, ఆర్తి డైవర్స్ తీసుకొని విడిపోవాలని ఫిక్స్ అయినట్లు రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించినట్లు పుకార్లు వచ్చాయి.
ఈ క్రమంలో.. జయం రవి భార్య ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టి విడాకులపై క్లారిటీ ఇచ్చింది. అది కూడా ఎలా చెప్పిందంటే.. తెలుగులో నితిన్ నటించిన మూవీని తమిళంలో జయం రవి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై 21 ఏళ్లు పూర్తి అయింది. దీంతో ఆర్తి ఈ మూవీ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘‘ప్రేమ అనే పదం.. ఇది మాటలు కాదు జీవితం’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రేమ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని చెప్పడంతో విడాకుల వార్తలు ఆర్తి చెక్ పెట్టినట్లు అయింది. ప్రస్తుతం ఆర్తి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.