‘సెక్స్ ఎడ్యుకేషన్’ నుంచి బిగ్ అప్‌డేట్.. పోస్టర్ చూస్తే ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేరు

by Hamsa |
‘సెక్స్ ఎడ్యుకేషన్’ నుంచి బిగ్ అప్‌డేట్.. పోస్టర్ చూస్తే ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేరు
X

దిశ, సినిమా: నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌లలో బాగా పాపుల‌ర్ అయిన కామెడీ-డ్రామా సిరీస్ ‘సెక్స్ ఎడ్యుకేషన్’. టీనేజ్‌లో జ‌రిగే అనుభ‌వాలు, రిలేష‌న్‌షిప్స్, కాలేజ్ లైఫ్ నేపథ్యంలో మూడు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్‌ ఫైన‌ల్ సీజన్‌ రెడీ అవుతుంది. అయితే ఇప్పటికే సెక్స్ ఎడ్యుకేషన్ ఫైన‌ల్ సీజ‌న్ నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్.. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘సెక్స్ ఎడ్యుకేషన్ ఫైన‌ల్ సీజ‌న్’ సెప్టెంబ‌ర్ 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రక‌టిస్తూ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ విడుదల చేశారు. ‘Come one, come all! The final season is upon us’ క్యాప్షన్‌తో కూడిన పోస్టర్‌లో నటీనటులంతా బుక్స్ చదువుతూ తమ ఇన్నర్ ఫీలింగ్స్ బయటపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక బ్రిటిష్ టెలివిజన్ నిర్మాణ సంస్థ ఎలెవ‌న్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ను లారీ నన్ రూపొందించారు.

Read More: ఆ ఇద్దరు హీరోల వల్ల అలా చేయడం నేర్చుకున్నాను.. Mrunal Thakur ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed