- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anchor Rashmi Gautam : నంద్యాల ఘటనపై.. యాంకర్ రష్మీ సంచలన ట్వీట్..!
దిశ, సినిమా: ఏపీలో గత మూడు నాలుగు రోజుల నుంచి మూడేళ్ల చిన్నారిని రేప్ చేసి శవం కూడా కనిపించకుండా చేసిన ఘటననే హాట్ టాపిక్‌గా అవుతున్న విషయం తెలిసిందే. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చు మర్రిలో సుజాత, మద్దిలేటి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కాగా అందులో రెండవ కుమార్తె వాసంతి 5వ తరగతి చదువుతోంది. అయితే, ఆదివారం సెలవు కావడంతో ఉదయం ఆడుకుంటానని ఇంటికి దగ్గరలోనే ఉన్న పార్క్ లోకి వెళ్ళింది. అలా వెళ్లిన పాప మధ్యాహ్నం దాటినా కూడా ఇంటికి రాలేదు. ఇక కూతురు ఇంటికి రాకపోవడంతో గాబరా పడుతూ తల్లిదండ్రులు మొత్తం వెతికారు. అయినా ఎక్కడ కనిపించకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు మైనర్ బాలురపై అనుమానంతో తనదైన స్టైల్‌లో పోలీసులు విచారించారు. అందులో ఒకరు బాలిక వాసంతి పై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నారు. ఈ దారుణానికి కారణమైన ముగ్గురు 15 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.
అయితే ఇప్పటికే ఈ ఘటనపై చాలా మంది స్పందించగా.. తాజాగా యాంకర్ రష్మీ కూడా స్పందిస్తూ ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. వాళ్లు పెద్దవాళ్ల లాగా రేప్ చేయగలిగితే వాళ్లని పెద్ద వాళ్ళ లాగానే శిక్షించాలి వాళ్ళు చేసిన తప్పుకు ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు కాబట్టి వాళ్ళు కచ్చితంగా మైనర్లు అయితే కాదు మైనర్లు అనే ఒక కార్డుతో వాళ్ళు తక్కువ శిక్షతో బయటపడడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ ఆమె తన సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
- Tags
- Rashmi Gautam