అనన్య నాగళ్ల ‘పొట్టేల్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్

by Hamsa |
అనన్య నాగళ్ల ‘పొట్టేల్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల పలు చిత్రాల్లో నటించినప్పటికీ పవన్ కల్యాణ్ ‘వకీల్‌సాబ్’ మూవీతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి వరుస ఆఫర్లు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇటీవల తంత్ర సినిమాతో ప్రేక్షకులను అలరించిన అనన్య ప్రజెంట్ ‘పొట్టేల్’ మూవీలో నటిస్తోంది. సాహిత్ మోత్కురి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యువ చంద్ర కృష్ణ హీరోగా నటిస్తున్నాడు.

అయితే దీనిని ఎన్‌ఐఎస్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి, ప్రగ్యా సన్నిధి క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ‘పొట్టేల్’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా, పొట్టేల్ విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ పవర్ ఫుల్ పోస్టర్‌ను ‘X’ వేదికగా షేర్ చేశారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 25న థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed