- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Anant Ambani : అంబానీ వారి పెళ్లికి ఖరీదైనా కారులో రామ్ చరణ్, ఉపాసన.. స్వయంగా డ్రైవ్ చేసిన చెర్రీ
దిశ, సినిమా : ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ పెళ్లి ఈరోజు(జులై 12, 2024) జరుగుతోందన్న విషయం తెలిసిందే. రాత్రి 9: 30 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు, వివాహ మహోత్సవ అలంకరణలు ప్రపంచాన్నే ఆకట్టుకుంటున్నాయి. వరల్డ్ వైడ్ ఫేమస్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, నటీ నటులు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు. కాగా టాలీవుడ్ నుంచి స్టార్ హీరో రాంచరణ్ కొణిదెల ఓ ఖరీదైన కారులో ఎయిర్ పోర్టుకు బయల్దేరిన వీడియో, వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి బేంగంపేట ఎయిర్ పోర్టుకు భార్య ఉపాసన, కూతురు క్లీంకారాతో పాటు బయల్దేరిన రాంచరణ్ తన కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టార్ కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అనంత్ అంబానీ పెళ్లి, అట్లనే రాంచరణ్ నడిపిన కారు ధర గురించి నెటిజన్లు డిస్కస్ చేస్తున్నారు. కాగా రాంచరణ్ నడిపిన రోల్స్ రాయిస్ స్పెక్టార్ కారు ధర అక్షరాలా రూ.7 కోట్లకు పైమాటేనట. పైగా ఇండియాలోనే సెలబ్రిటీల్లో ఈ కారు కలిగిన రెండవ ప్రముఖ వ్యక్తి చెర్రీ మాత్రమేనని పలువురు కామెంట్లు పెడుతున్నారు.