- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేనేంటో నిరూపించుకునే అవకాశం ఇంకా రాలేదు.. అమృత
దిశ, సినిమా: యంగ్ అమృత అయ్యర్ తన సక్సెస్ సీక్రెట్ ఎంటో చెప్పేసింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆమె తాజా సమావేశంలో కెరీర్ అనుభవాలను పంచుకుంటూ.. అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటేనే విజయం వరిస్తుందని చెప్పింది. ‘‘రెడ్’ సినిమాకు తెలుగు రాకపోయినా కష్టపడి నేర్చుకున్న. ఇప్పుడు గలగలా మాట్లాడగలను. చిన్నప్పటి నుంచి గ్లామర్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లోవాళ్లు, స్నేహితులు కూడా ప్రోత్సహించారు. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఆహార నియమాలు తప్పనిసరి. ఫిట్‌నెస్ కాపాడుకోవాలి’ అని తెలిపింది. అలాగే ‘2021 ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ఏడాది నా ఐదు సినిమాలు విడుదలయ్యాయి. ఈ తరహా పాత్రలే చేయాలని గిరి గీసుకోలేదు. కథ, పాత్ర నచ్చితే ఓకే చెబుతాను. ఇప్పటివరకు నేను పోషించిన పాత్రల్లో సంప్రదాయమైనవే ఎక్కువ. నేనేంటో నిరూపించుకునే అవకాశం ఇంకా రాలేదు అనుకుంటున్నా. చాలెంజింగ్ పాత్రలు పోషిస్తేనే నటిగా సంతృప్తి కలుగుతుంది’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.
- Tags
- Amritha Aiyer