అప్పుల్లో కూరుకుపోయిన హాలీవుడ్ నటి.. రెంట్ కూడా కట్టలేక

by srinivas |   ( Updated:2022-08-25 13:39:19.0  )
అప్పుల్లో కూరుకుపోయిన హాలీవుడ్ నటి.. రెంట్ కూడా కట్టలేక
X

దిశ, సినిమా : హాలీవుడ్ యాక్ట్రెస్ అంబర్ హర్డ్ జీవితం అనేక ములపులు తిరుగుతోంది. మాజీ భర్త, నటుడు జానీ డెప్‌తో విడాకుల ఇష్యూతో తన ప్రతిష్టను దిగజార్చుకున్న నటిని స్నేహితులు కూడా దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇటీవలే పాత ఇంటి రెంట్ కట్టలేక ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లోకి మారాల్సి వచ్చిందని, అప్పులు ఇచ్చిన ఫ్రెండ్స్ కూడా తిరిగి చెల్లించాలంటూ వేధిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇక దీంతోపాటు పలు రకాల లోన్లు, ఫైనాన్స్‌లు పెండింగ్‌లోనే ఉన్నాయని తెలుస్తుండగా.. ఈ ఒత్తిడినంతా తట్టుకోలేక తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నట్లు గొప్పలు చెప్పుకుంటుందని, ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా కెరీర్ కూడా ఒడిదుడుకులకు లోనవుతున్నట్లు ఇంటర్నేషనల్ మీడియాలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి.

పిల్లలు పుట్టగానే సెక్స్ మానేశా: పోర్న్ స్టార్

Advertisement

Next Story