పవన్ ‘Gudumba Shankar’ రీరిలీజ్‌తో పాటుగా ‘OG’ నుంచి గ్లింప్స్.. !

by Prasanna |   ( Updated:2023-08-20 17:07:10.0  )
పవన్ ‘Gudumba Shankar’ రీరిలీజ్‌తో పాటుగా ‘OG’ నుంచి గ్లింప్స్.. !
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గుడుంబా శంకర్’ మూవీ రీరిలీజ్‌కి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. మీరా జాస్మిన్ హీరోయిన్‌గా, వీర శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించనప్పటికీ.. ఇందులో పవన్ ఆటిట్యూడ్, స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కాగా తాజాగా మూవీ టీం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే రోజు రిలీజ్ చేస్తున్నట్టు డేట్ ఫిక్స్ చేశారు. అంతేకాదు ఈ రిలీజ్ రోజే పవన్ ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌గా ‘OG’ మూవీ నుంచి గ్లింప్స్ కూడా థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే అభిమానులకు ఆ రోజు మరో పెద్ద ట్రీట్ అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి : ‘గాండీవధారి అర్జున’ మూవీ ప్రీరిలీజ్‌కు డేట్, ప్లేస్ ఫిక్స్..

Advertisement

Next Story