పవన్ గెలుపుపై అల్లు అర్జున్ ట్వీట్.. పక్కకు వెళ్లి ఆడుకోమంటున్న మెగా ఫ్యాన్స్

by Prasanna |
Allu Arjun Declines 10 Crore Deal to Promote Liquor Brands
X

దిశ, సినిమా: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. ఇన్ని రోజులు ప్రతి పక్షంలో ఉన్న అభ్యర్థులు ఎవరూ ఊహించలేనంత విజయకేతనం ఎగురవేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించారు. వంగా గీత పై 69,169 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక జన సైనికులు సంబరాలు జరుపుకుంటున్నారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అర్జున్ ట్వీట్ చేస్తూ, " అద్భుతమైన విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్‌కు నా హృదయపూర్వక అభినందనలు. మీ కృషి, అంకితభావం, ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధత ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు. ” అంటూ ఎక్స్ లో ట్వీట్ చేసారు.

దీనిపై స్పందించిన మెగా ఫ్యాన్స్ ఇప్పుడు బంధాలు గుర్తు వచ్చాయా.. గెలిచాక ఎవరికైనా గుర్తు వస్తాయి లే .. పక్కకి వెళ్లి ఆడుకోమ్మా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story