అల్లు అర్జున్ సర్జరీకి ముందు పిక్స్ వైరల్..

by Anjali |   ( Updated:2023-08-28 14:18:50.0  )
అల్లు అర్జున్ సర్జరీకి ముందు పిక్స్ వైరల్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న వాళ్లంతా ఫేస్, బాడీ సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. మొదట్లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో బన్నీ చాలా విమర్శలు ఎదుర్కొన్నారట. ఈ మాటలన్నీ తట్టుకోలేకనే ఈ హీరో సర్జరీ చేయించుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ సర్జరీ‌కి ముందు ఓ ఫొటో వైరల్ అవుతుంది. నిఖిల్ ప్రభాస్ అనే ఓ వ్యక్తి తన ట్విటర్లో పిక్ షేర్ చేసి.. ‘‘అచ్చం రోడ్ సైడ్ వర్కర్‌లా, అంత వరస్ట్‌గా ఉన్నాడు ఈ పిక్‌లో’’ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సర్జరీ ముందు అల్లు అర్జున్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.



Advertisement

Next Story

Most Viewed