- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎట్టకేలకు రిలీజైన ‘OMG 2’ ట్రైలర్.. భారతీయ విద్యా వ్యవస్థ లోపాలే టార్గెట్!
దిశ, సినిమా : బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ శివుడి దూతగా నటించిన ‘OMG 2’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. ‘ఓ మై గాడ్’ మూవీ సీక్వెల్‌గా వస్తున్న సినిమా సెన్సార్ బోర్డు అడ్డంకులు తొలగించుకుని ఆగస్టు 11న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా విడుదలైన ట్రైలర్‌ను గమనిస్తే.. తన భక్తుడు కష్టాల్లో ఉన్నాడని, అతనికి సాయం చేయడానికి ఎవరినైనా పంపించాలని తన వాహనమైన నందికి శివుడు చెప్పే సీన్‌తో ట్రైలర్ మొదలైంది.
ఇక స్కూల్లో పాడుపని చేసిన తన కొడుకును ఇంటికి పంపించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టుకెక్కుతాడు తండ్రి. న్యాయం కోసం తాను ఎంతగానో నమ్మే శివుడుని వేడుకుంటాడు. కోర్టులో తన కేసును తానే వాదించుకుంటాడు. ఇక ప్రత్యర్థి లాయర్‌గా యామీ గౌతమ్ కనిపించగా.. ఇద్దరి మధ్య జరిగే కోర్టు డ్రామాను ఆసక్తికరంగా చూపించారు మేకర్స్. ఇక తండ్రి పాత్రలో పంకజ్ త్రిపాఠి కనిపించగా సాయం చేయడానికి వచ్చిన అక్షయ్ ఏం చేశాడనేది సస్పెన్స్. ఇందులో వాదనలన్నీ సరదాగా సాగుతున్నట్లే కనిపించినా.. భారతీయ విద్యా వ్యవస్థలోని లోపాలనూ ఎత్తి చూపడం విశేషం.