- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ భర్తను తలుచుకుంటూ నటి ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: నటుడు రఘు వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విలక్షణ నటునిగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఆయన.. ఏ పాత్రల్లోనైనా పరకాయ ప్రవేశం చేసి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. దాదాపు 150 సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన.. 2008 మార్చి 19న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన మరణాన్ని గుర్తుచేసుకుంటూ సీనియర్ నటి, అతడి మాజీ భార్య రోహిణి మొల్లేటి X వేదికగా పోస్ట్ పెట్టారు.
1996లో నటి రోహిణి, రఘువరన్ వివాహం చేసుకున్నారు. వారికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. వీరి దాంపత్య జీవితంలో ఏవో సమస్యలు రావడంతో 2003లో వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. అందుకు గల కారణాలను సైతం రోహిణి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక ఈరోజు తన మాజి భర్త చనిపోయిన రోజు కావడంతో ఆమె తన X ఖాతా ద్వారా ఆయనకు నివాళులర్పించారు. కాగా.. రోహిణి బాల్య నటిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో అనేక సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక ఇప్పటికి కూడా ఈమె హీరోల సరసన అమ్మ క్యారెక్టర్స్ చేస్తూ బీజీగా ఉన్నారు.