- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బోల్డ్ సీన్స్‌లో నటించడం చాలా హెల్ప్ అయింది.. హెబ్బా పటేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
దిశ, సినిమా: ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఈ బ్యూటీదే ప్రధాన పాత్ర కావడంతో ఇందులో ఆమె అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ ఒక్క మూవీతో యువతలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది.
ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈ భామ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాల్లో నటించిన కూడా సరైన హిట్ అందుకోలేదు. కాగా పెద్ద స్టార్లతో నటించే అవకాశం.. రాకపోయినప్పటికీ హెబ్బా పటేల్ చిన్న సినిమాలతో కెరీర్‌ని బాగానే ముందుకు నడుపుతోంది. అయితే 2018లో హెబ్బా పటేల్ నటించిన 24 కిస్సెస్.. విజయాన్ని సాధించకపోయినా.. బోలెడన్ని వివాదాల్లో అయితే ఇరుక్కుంది. సినిమా టైటిల్ చూస్తేనే సగం కంటెంట్ అర్థమయిపోతుంది.సినిమా మొత్తం బోలెడు కిస్ సన్నివేశాలు, లిప్ లాక్ లు, ఇంటిమేట్ సన్నివేశాలతో… హెబ్బా పటేల్ ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది. ప్రస్తుతం హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే మూవీలో నటిస్తుంది.
ఇదిలా ఉండగా తాజాగా హెబ్బా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.."గతంలో 24 కిస్సెస్ సినిమా చేయడం వల్ల నాకు ఉండే భయాలు, సందేహాలు అన్నీ పోయాయి. సినిమా చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే.. మనం మూవీ సెట్ లో ఎలాంటి భయం లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే మనం ఎలా ఉన్నాము అనే విషయాన్ని అక్కడ ఎవరూ పట్టించుకోరు. అందరూ తమ తమ జాబ్స్ తో బిజీగా ఉంటారు. మనం ఎలా ఉన్నాం అనే విషయాన్ని పట్టించుకునే టైం కూడా వాళ్లకి ఉండదు," అని చెప్పుకొచ్చింది ఈ భామ."నేను బయట ఎప్పుడు నిజ జీవితంలో ఉండలేనట్టుగా సినిమా నన్ను చూపించింది. నేను బయట అంత రొమాంటిక్ పర్సన్ కాదు. నేను ప్రేమిస్తాను కానీ రొమాంటిక్ పర్సన్ ని కాదు. నేను నిజ జీవితంలో ఎప్పుడు ఉండలేనటువంటి విధంగా ఆ సినిమాలో ఉన్న సోనాలి పాత్ర నన్ను చూపించింది" అని అన్నారు హెబ్బా పటేల్. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.