- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిహారికను పట్టించుకోని మెగా ఫ్యామిలీ.. అందుకే ఆ సినిమాకు సపోర్ట్ ఇవ్వడం లేదా?
దిశ, సినిమా : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకొని, మనస్పర్థల కారణంగా విడిపోయిన విషయం తెలిసిందే. ఇక డివోర్స్ తర్వాత ఈ బ్యూటీ కెరీర్ పరంగా చాలా బిజీ అయిపోయింది. నటిగా, నిర్మాతగా, ప్రొడ్యూసర్‌గా మారి పలు సినిమాలు చేస్తుంది. కాగా, తాజాగా ఈమె ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రోళ్లు విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈ సినిమాకు మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ మాత్రం రావడం లేదు. దీంతో చాలా మంది ఈమెపై పలు కామెంట్స్ చేస్తున్నారు. నిహారికకు తన మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వడం లేదు, ఆమె ఒంటరిగా కష్టపడుతోందంటూ నెట్టింట్లో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. కాగా, దీనిపై తాజాగా నిహారిక మాట్లాడింది. మా ఫ్యామిలీ చాలా బిజీగా ఉంది. నాన్న పాలిటిక్స్‌లో బిజీ అయిపోయి, మంగళ గిరిలో ఉన్నారు. వరుణ్ అన్నవైజాగ్‌లో షూటింగ్‌లో ఉన్నాడు, వదిన డెహ్రాడూన్‌లో ఉంది.చరణ్, పెద్దనాన్న పారిన్ ఒలంపిక్స్‌కు వెళ్లారు. అందుకే వారు నా మూవీ ప్రమోషన్స్‌క రావడం లేదు అంటూ పేర్కొంది.