భర్త పవన్ కల్యాణ్ అయితే భార్య భూమిక అనుకుంటుందేమో

by Anukaran |   ( Updated:2021-03-07 06:22:44.0  )
భర్త పవన్ కల్యాణ్ అయితే భార్య భూమిక అనుకుంటుందేమో
X

దిశ,వెబ్‌డెస్క్: ప‌వ‌న్ క‌ల్యాణ్, భూమిక జంట‌గా న‌టించిన చిత్రం ఖుషి. ఆ సినిమాలో ఆఖ‌రులో హీరో, హీరోయిన్ లకు 17 మంది పిల్లలు పుడితేనే.. అమ్మో ఇంత‌మంది పిల్లలా..? అని నోరెళ్ల బెట్టాం. కానీ వీళ్లు మాత్రం 100 మంది పిల్లల్ని కనాలని కంకణం కట్టుకున్నారు. అందుకే టపిటపి మని పిల్లల్ని కంటున్నారు.

జార్జియాలో నివ‌సిస్తోన్న ర‌ష్యాకు చెందిన 23ఏళ్ల క్రిస్టియానాకు ఇప్పటికే 11మంది పిల్లలున్నారు. అయితే పిల్లలంటే అమితంగా ఇష్టపడే ఆమె 100 అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని టార్గెట్ గా పెట్టుకుంది. ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో పుట్టి పెరిగిన క్రిస్టియానా హాలిడేస్‌లో భాగంగా జార్జియాకు వెళ్లింది. అక్కడ టర్కీలో పుట్టి జార్జీయాలో పెరిగిన కోటీశ్వరుడు గాలిప్ ను చూసి ప్రేమలో పడింది. గాలిప్ కూడా క్రిస్టియానాను అమితంగా ప్రేమించాడు. సీన్ కట్ చేస్తే నాలుగేళ్ల తరువాత పెళ్లి చేసుకున్న వీళ్లిద్దరూ విక అనే అమ్మాయికి నేరుగా జ‌న్మనిచ్చారు. ఆ త‌ర్వాత స‌రోగసి ద్వారా వ‌రుస‌గా పిల్లల్ని కంటూ వ‌స్తున్నారు. ఇప్పటికి క్రిస్టియానా 11మందికి జన్మనిచ్చింది. సెంచరీ పూర్తిచేయాలని చూస్తోంది ఆ జంట. గ‌తంలో పెద్దలెవరైనా ఆశీర్వదిస్తే.. గంపెడు పిల్లలతో క‌ల‌కాలం సంతోషం గా ఉండ‌మ‌ని దీవించేవాళ్లు. ఈ క‌పుల్స్ కు అది బాగా న‌చ్చిన‌ట్లు అందుకే వరుసగా పిల్లల్ని కంటున్నారు.

Advertisement

Next Story