- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోం ఐసోలేషన్‌లో తల్లీకూతురు మృతి
దిశ, ముధోల్: కొవిడ్ తో తల్లి, కూతురు ఓకె గదిలో మృతి చెందిన ఘటన ముధోల్ మండలం రాంటెక్ గ్రామంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి లక్ష్మి బాయి(70), కూతురు భారతిబాయి(50) ఇద్దరికి ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వీరు గత నాలుగు రోజుల నుంచి హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. మృతదేహాల వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఐసోలేషన్ లో ఉన్నప్పుడే వారిద్దరు మరణించారని, బాడీ మొత్తం కుల్లిపోవడంతో గత 3 రోజుల క్రితంమే వీరు చనిపోయారని గ్రామస్తులు భావిస్తున్నారు.
మృతదేహాలను తొలగించడానికి ఎవరు ముందుకు రాక పోవడంతో శవాలను తొలగించడానికి వచ్చిన సహారా యూత్ సభ్యులు, బాడీమొత్తం కుల్లిపోయిందని ఆ ఏరియా లో నిలబడే పరిస్థితి కూడా లేదని తెలిపారు. తొందరగా అధికార యంత్రాంగం ఈ మృతదేహాలను తొలగించాలని గ్రామాస్థులు, అక్కడి వచ్చిన సహారా యూత్ సభ్యులు అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.