పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలు.. షరతులు ఇవే

by Shamantha N |   ( Updated:2021-07-12 07:43:54.0  )
parlament news
X

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ సమావేశాలను జూలై 19 నుంచి ఆగస్టు 13వరకు నిర్వహించనున్నట్టు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు 19 రోజుల పాటు జరగనున్నట్టు ఆయన తెలిపారు. ఉభయసభల సమావేశాలు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.

కాగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా ప్రోటోకాల్స్‌ను అనుసరించి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కరోనా నిబంధనలను అనుసరించి ఎంపీలను, మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించనున్నట్టు తెలిపారు. అయితే అనుమతికి ఆర్టీపీసీఆర్ టెస్టు తప్పని సరికాదని వెల్లడించారు. కానీ ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ తీసుకోని సభ్యులు ఎవరైనా ఉంటే వారు మాత్రం టెస్టు చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు

Advertisement

Next Story

Most Viewed