- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనాకు మరో షాక్..!
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం చైనాకు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల పలు నివేదికలు ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నాయి. చైనా దిగుమతులపై యాంటి డంపింగ్ పన్నుల గడువును కేంద్రం పెంచాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా వినిపిస్తోన్నది. ముఖ్యంగా 25 వస్తువులపై ఈ పన్ను గడువును పెంచాలనే ప్రతిపాదనను మోదీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోన్నది.
భారీ దిగుమతులతో దేశీ తయారీ కంపెనీలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం ఉండొచ్చని కేంద్రం భావిస్తోన్నది. ఈ కారణంగానే 25 ఉత్పత్తులపై యాంటి డంపింగ్, సేఫ్‌గార్డ్ పన్నులను పెంచాలని చూస్తోన్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి ఇండియాకు సుమారు రూ. 5 లక్షల కోట్ల ఉత్పత్తులు దిగుమతి అయ్యాయి. ఈ 25 ఉత్పత్తులపై వీటిపై ఐదేళ్ల క్రితం ప్రభుత్వం యాంటి డంపింగ్ పన్ను విధించింది. ఈ ఏడాదితో ఈ పన్నుల గడువు ముగియనుంది. సాధారణంగా, వస్తువు మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే ఉత్పత్తులను భారీగా దిగుమతి చేసుకోవడాన్ని డంపింగ్‌గా నిర్ధారిస్తారు. అలాగే, దిగుమతుల భారీ పెరుగుదలను నియంత్రించేందుకు, దేశీయ పరిశ్రమలను రక్షించేందుకు వీలుగా సేఫ్‌గార్డ్ పన్నును విధిస్తారు.
కేంద్రం యాంటి డంపింగ్ పన్నును పొడిగించాలనుకుంటున్న ఉత్పత్తుల్లో..యూఎస్‌బీ ఫ్లాష్ డ్రైవ్స్, హాట్ రోల్‌డ్ ఫ్లాట్ ప్రాడక్ట్స్ ఆఫ్ స్టెయిన్‌లెస్ స్టీల్, సోడియం సిట్రేట్, క్యాలిక్యులేటర్లు, ఫ్లాక్స్ ఫ్యాబ్రిక్స్, మెసరింగ్ టేప్స్, విటమిన్-ఈ, విటమిన్-సీ, కిచెన్ వేర్, కౌస్టిక్ సోడా, నైలాన్ టైర్ కోర్‌డ్, సోలార్ సెల్స్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ మిషనరీ, టెబుల్ వేర్, ఫ్లోట్ గ్లాస్ వంటి 25 ఉత్పత్తులు ఉన్నాయి.