- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ సమస్య వచ్చినా వెంటనే నన్ను కలవండి : ఎమ్మెల్సీ కవిత
దిశ, తెలంగాణ బ్యూరో: దివ్యాంగులకు అండగా ఉంటానని, సమస్యలను దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పలువురు దివ్యాంగులు సోషల్ మీడియా ద్వారా ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ మూడు చక్రాల స్కూటీలు అందజేయాలని వేడుకోగా, ఎమ్మెల్సీ వెంటనే స్పందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో హైదారాబాద్ పురానాపూల్‌కు చెందిన సూర్య ప్రకాష్, కుత్బుల్లాపూర్‌కు చెందిన సయ్యద్ సలీం, సిరిసిల్లకు చెందిన పోచంపల్లి శ్రీనివాస్, శేఖర్, ఖానాపూర్‌కు చెందిన సుధాకర్, వరంగల్ రూరల్‌కు చెందిన భరత్, షబానాకు మూడు చక్రాల స్కూటీలు అందజేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ… ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపడుతుందన్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని వారికి భరోసానిచ్చారు. ఉగాది పర్వదినాన స్కూటీలు అందజేయడంతో దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.