బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తోంది..

by Shyam |
బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తోంది..
X

దిశ, దుబ్బాక: సోషల్ మీడియాలో బీజేపీ వాళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారనీ.. ఆరోపణలను వారు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బీజేపీకి ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నాయకులు గోబెల్ ప్రచారం చేస్తున్నారనీ, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు ఆయన అనుచరులతో కలిసి అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. దుబ్బాక మారెమ్మ నుండి దుంపలపల్లి వరకు ఎలాంటి రోడ్డు వేయకుండా కోటి రూపాయలు, టౌన్ హాల్ కు మూడు కోట్లు కాజేశారని టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము లేకనే ఇలా నీచమైన రాజకీయాలకు దిగజారుతున్నారని ఆయన తెలిపారు.

Advertisement

Next Story