- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు కల్పించాలి: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
దిశ ప్రతినిధి, నల్లగొండ: పరిశ్రమలకు మేం వ్యతిరేకం కాదు. పరిశ్రమలు పెరగాలి.. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం మహంకాళి గూడెంలో డెక్కన్ సిమెంట్ లిమిటెడ్ ప్లాంట్ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమల్లో స్థానిక యువతకు 70 శాతం ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఉద్యోగాల కల్పనలో డెక్కన్ కంపెనీ మిగతా కంపెనీలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. డెక్కన్ సిమెంట్ లో ఏండ్ల తరబడిగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న జాన్ పహాడ్ దర్గాను సీఎస్సార్ ఫండ్ కింద అభివృద్ధి చేయాలని సూచించారు.
కంపెనీలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సర్వీస్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారని, ఫలితంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. హుజుర్ నగర్ నియోజకవర్గంలో 35వేల మంది యువత ఉన్నారని, వారందరికీ స్థానిక కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వాలని తెలిపారు. ప్రాంతీయతత్వంతో పై స్థాయి ఆంధ్ర ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తోందని, అది ఏమాత్రం సరికాదని పేర్కొన్నారు. కంపెనీలో పొల్యూషన్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేయాలని, పొల్యూషన్ వివరాలను వెబ్ సైట్ లో పొందుపర్చాలని అధికారులను ఆదేశించారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తే.. జీఎస్టీలో ప్రభుత్వంతో మాట్లాడి రాయితీ కల్పిస్తామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఒక్కటే కాకుండా.. చిన్న చిన్న క్రాంటాక్ట్ పనులను సైతం యువతకు ఇచ్చే ఆలోచన చేయాలని వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పీసీబీ అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మా భవిష్యత్ తరాలకు అవసరం..
ప్లాంట్ విస్తరణ మాకు చాలా అవసరం. స్థానికులకు ఉద్యోగాలు కావాలి. విద్య, వైద్యం ఉచితంగా కల్పిస్తున్నారు. 40 ఏండ్లుగా ఫ్యాక్టరీతో అనుబంధం ఉంది. మా తండ్రులు బతికారు. మేము బతుకుతున్నాం.. మా పిల్లలు దీనిపైనే బతుకుతారని ఆశిస్తున్నా.
– పిడమర్తి సంగీత రావు, రాయిపాడు
- Tags
- mla