- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయుధాలను వెంటనే డిపాజిట్ చేయండి: హోంశాఖ
దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్ ఆయుధాలను వెంటనే డిపాజిట్ చేయాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు మార్చి14న జరగనున్నట్టు తెలిపారు. ఆర్మ్స్ యాక్ట్ 1959 ప్రకారం ఎన్నికలు జరిగే ఈ 6 జిల్లాల (ఉమ్మడి) పరిధిలో కొత్త ఆయుధాలకు లైసెన్స్ ఇవ్వడం రద్దు చేయడంతో పాటు ఇప్పటికే అనుమతి పొందిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయాలన్నారు. ఈ ఆయుధాలను ఆయా పోలీస్ స్టేషన్లు, జిల్లా కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయాలని సూచించారు. హైదరాబాద్, నల్లగొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు.