కరోనా నే కావొచ్చు : మంత్రి వేముల

by Shyam |
కరోనా నే కావొచ్చు : మంత్రి వేముల
X

దిశ, నిజామాబాద్: మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని తన ఇంటి ఆవరణలో పరిసరాలు పరిశుభ్రం చేసి మొక్కలకు నీటిని పట్టారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ… మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ సూచించినట్లు వర్షాకాలం దగ్గర్లోనే ఉంది కాబట్టి దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా, సామాజిక బాధ్యతగా భావించి తమ ఇంటి ఆవరణలో పేరుకు పోయిన చెత్తను, నిల్వ ఉన్న నీటిని తొలగించాలన్నారు. తద్వారా దోమలను నిలువరించగలుగుతామని, సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతామని మంత్రి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దోమల ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా లాంటివి వస్తే కరోనా భయం వెంటాడుతుందని, జలుబు, జ్వరం లాంటి జబ్బులు వస్తే కరోనా నే కావొచ్చు అనే భయం నెలకొంటుందని, అందువల్ల ఇంటి ఆవరణలోని పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుందాం మంత్రి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed