- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం సేకరణలో నిజామాబాద్ అగ్రస్థానం : మంత్రి వేముల
దిశ, నిజామాబాద్: ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ అన్నారు. కరోనా కష్ట సమయంలోనూ రైతులకు ఇబ్బందులు లేకుండా వేగంగా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. రోజుకు 20వేల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్నికొనుగోలు చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, 20 రోజుల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు మిగిలిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. జిల్లా కేంద్రంలో ధాన్యం సేకరణ పై ఆదివారం ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షించారు. జిల్లాలో మొత్తం 339 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 2.19 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించామన్నారు. 1.94 లక్షల మెట్రిక్‌టన్నుల (96శాతం) ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించామని తెలపారు. ఆర్మూర్‌లో 90శాతం, బోధన్‌లో 97శాతం, బాన్సువాడలో 99శాతం, రూరల్‌లో 88శాతం , బాల్కొండలో 85శాతం ధాన్యం సేకరించి రైస్‌మిల్లులకు తరలించామన్నారు. హమాలీల కొరత ఉన్నందున ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రైతులు నాణ్యతతో (ఎఫ్‌ఏక్యూ) కూడిన ధాన్యాన్ని తీసుకువచ్చినప్పటికీ రైస్‌మిల్లర్లు కడ్తా తీయడం క్షమించరాని నేరమని అన్నారు. ధాన్యాన్ని 16 గంటలలోగా రైస్‌మిల్లర్లు అన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. కడ్తా పేరుతో దోపిడి జరగకుండా ఏఈవోలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఏఈవోలు ఏమాత్రం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యవసాయాధికారి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని,ఇప్పటికే రూ.142 కోట్లను మద్దతు ధర కింద రైతులకు చెల్లించిందని చెప్పారు. ఇందులో చిల్లిగవ్వ కూడా కేంద్రం వాటా లేదని స్పష్టం చేశారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడికి తలొగ్గొద్దని, ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని అధికారులకు తెలిపారు. రైతులతో బలవంతంగా హామీ పత్రం రాయించుకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరు రాజకీయాలు చేస్తున్నారో, ఎవరు రైతుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారో రైతాంగం గమనిస్తోందన్నారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగుతున్న నేతల తీరు రైతులకు అర్థమైందని వివరించారు. ఈ సమావేశం లో జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ , మహమ్మద్ షకీల్, జీవన్ రెడ్డి, గణేష్ గుప్తాతో పాటు జెడ్పీ చైర్మన్ విట్టల్ రావు, కలెక్టర్ సీ.నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ శర్మ, డీసీసీబీ వైస్‌చైర్మన్ కే రమేశ్‌రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags: Minister Vemula prashanth reddy,review,crop Collection