- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరేండ్ల కృషి ఫలితమే..నెంబర్ వన్ తెలంగాణ
దిశ,నిజామాబాద్: కేవలం ఆరేండ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిందంటే ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ..ఎందరో అమరవీరుల త్యాగాలు, ఉద్యమ నేత కేసీఆర్ పోరాటం ఫలితంగా జూన్ 2, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని వివరించారు. 50 ఏండ్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్ష నెరవేరిందని చెప్పుకొచ్చారు. ఉద్యమనేతే సీఎం కావడంతో పేదలు, రైతులు ఆనందంగా ఉన్నారని మంత్రి తెలిపారు. పేదలకు రూ.2,016 ఆసరా పెన్షన్, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు పథకం కింద పంటకు రూ.5000ల చొప్పున ఏడాదికి రెండు పంటలకు కలిపి రూ.10,000వరకు పంట పెట్టుబడి, గుంట పొలమున్న రైతు మరణిస్తే ఆ కుటుంబానికి వారం రోజుల్లోనే రూ.5 లక్షల ఇన్సూరెన్స్ ఇంటి వద్దకే వచ్చేలా సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పథకాలన్నీ దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే అమలవుతున్నాయన్నారు. కేవలం మూడేండ్లలోనే దేశంలో అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత తెలంగాణకు దక్కిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పోలీసు కమిషనర్ కార్తికేయ, ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీలు విజీ గౌడ్, రాజేశ్వర్, ఆకుల లలిత, జెడ్పీ చైర్మన్ విట్టల్ రావు, డీసీసీబీ చైర్మన్ భాస్కర్, నొడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మేయర్ దండు నీతు కిరణ్, అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, లత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.