- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల పక్షాన ముఖ్యమంత్రికి మంత్రి వేముల విజ్ఞప్తి
దిశ, నిజామాబాద్: వానాకాలం సాగుదృష్ట్యా ఆయకట్టు రైతుల కోరిక మేరకు ఎస్సారెస్పీ వరద కాలువను నింపాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కోరారు. వరద కాలువలోని సాగునీటి ద్వారా పెద్ద ఎత్తున ఆయకట్టు రైతులకు మేలు జరుగుతుందని ఆయన ముఖ్యమంత్రికి ఆయకట్టు రైతుల పక్షాన విజ్ఞప్తి చేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన సీఎం, రైతుల సౌలభ్యం కోసం వెంటనే కాళేశ్వరం నీళ్లతో నింపాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఒక రైతుగా సాగునీటి కష్టాలు, అవసరాలు తెలుసు కాబట్టి వరద కాలువ కింద రైతుల కోరికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చెప్పగానే వెంటనే సహృదయంతో స్పందించారని మంత్రి వేముల చెప్పారు. రైతు సంక్షేమం విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ కింద ఉన్న ఆయకట్టు రైతులు అప్రమత్తం కావాలని, సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రైతులను కోరారు.