ప్రజారోగ్యం కోసమే లాక్‌డౌన్ : మంత్రి వేముల

by Shyam |
ప్రజారోగ్యం కోసమే లాక్‌డౌన్ : మంత్రి వేముల
X

దిశ, నిజామాబాద్ : ప్రజారోగ్యం కోసమే తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిందని భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని జనహిత భవనంలో బుధవారం ఆయన మాట్లాడుతూ..కరోనా వైరస్‌ను అరికట్టేందకు అందరి సహకారం అవసరమని చెప్పారు. అత్యవసర సమయంలో తప్ప ప్రజలు బయటకు రావొద్దని. లేనియెడల స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. గ్రామాలను కట్టడి చేయడంలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేసి వైరస్ నివారణకు కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలోని 525 గ్రామ పంచాయతీల్లో రహదారుల వెంట ప్రజలు కంచెలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మూడు రోజుల్లో ప్రభుత్వం ప్రతి వ్యక్తికి 12 కిలోల రేషన్ బియ్యం రూ.1500 నగదును అందజేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. జిల్లాలో 10 లక్షల 45 వేల మంది జనాభా ఉంటే వారిలో ఎనిమిది లక్షల 50 వేల మందికి రేషన్ బియ్యం ప్రభుత్వం ఇస్తుందన్నారు. జిల్లాలోని రైతులకు అవసరమైన అన్ని గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు తప్పని సరిగా గృహనిర్బంధంలో ఉండాలని సూచించారు. ఒక్క కామారెడ్డి జిల్లాలో 1070 మందిని అధికారులు గుర్తించినట్టు తెలిపారు. జిల్లాలో 14 మందికి కరోనా లక్షణాలు ఉండగా వారిలో 13 మందికి నెగిటివ్ వచ్చిందని, ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు. వారి కోసం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకలు ఏర్పాటు చేశామని, 25 పడకలు ప్రైవేట్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లా ఎస్పీ శ్వేత కలెక్టర్లు యాదిరెడ్డి వెంకటేష్ లోతురే ప్రత్యేక కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మున్సిపాలిటీ కమిషనర్ అమినుసింగు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

tags: minister vemula prashanth reddy, corona, lockdown, for it people health

Advertisement

Next Story

Most Viewed