కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి వేముల

by Shyam |
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి వేముల
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం వేల్పూర్ మండలం పచ్చల్ నడ్కుడ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం రేషన్ కార్డులు లేని పేదలకు గ్రామ పంచాయతీ వద్ద బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం రైతుల వద్దకు వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. రాష్ట్రంలో గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా మద్దతు ధరకే వరి ధాన్యం సేకరిస్తామన్నారు. జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తున్నందున ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగా రెడ్డి, సర్పంచ్ ఏనుగు శ్వేత, అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్, డీసీవో సింహాచలం, డీఎస్‌సీవో వెంకటేశ్, రైతులు పాల్గొన్నారు.

Tags: carona, lockdown, minister vemula prashanth reddy, rice purchasing center opening

Advertisement

Next Story

Most Viewed