- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చదువుకున్నవారితోనే అసలు సమస్య
దిశ, మహబూబ్ నగర్: కరోనా నియంత్రణలో చదువుకున్నవారి కంటే చదువుకోని వారే నయమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ . గ్రామాల్లో ప్రజలు స్వీయ నియంత్రణలో ఉన్నారని, అయితే పట్టణ ప్రజలు మాత్రం వివిధ కారణాలతో బయటకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 135 కోట్ల జనాభా ఉన్నమన దేశంలో ఇలాంటి వైపరిత్యాలను ఎదుర్కొవాలంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమంతా ప్రాణాలను పణంగా పెట్టి మీకోసం పని చేస్తున్నామని.. ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కొంతమంది అధికారులు కేవలం ఆర్భాటాలకు పరిమితం అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఇలాంటి వారు తమ పద్ధతులు మార్చుకోవాలని ఆదేశించారు. కొంత మంది ఆకతాయిలు బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తూ వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారని ఇలాంటి వారిపై పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
tag;corona, minister, srinivas goud, ts news