ఆయిల్​ఫామ్​ సాగులో అగ్రస్థానంలో ఉండాలి: నిరంజన్‌రెడ్డి

by Shyam |
ఆయిల్​ఫామ్​ సాగులో అగ్రస్థానంలో ఉండాలి: నిరంజన్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆయిల్‌ఫామ్‌ సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్ధానంలో నిలవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయిల్‌ఫామ్‌ సాగుపై ఉద్యానవన శిక్షణా కేంద్రంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వచ్చే నాలుగేండ్లలో 8.14లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. కంపెనీలు వారికి కేటాయించిన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు ప్రారంభించి, గ్రామాల వారీగా సర్వే నిర్వహించి ఉద్యానవన శాఖకు నివేదిక ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు 15జిల్లాల్లో 8కంపెనీలకు 4లక్షల 61వేల 300ఎకరాలు కేటాయించామని, ఉద్యానవన శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కంపెనీలు సకాలంలో ఆయిల్‌ఫామ్‌ పంటలను సాగులోకి తీసుకు రావాలని సూచించారు.

ఆయిల్‌ఫామ్‌ సాగుకు అనువైన నేలలు కలిగి ఉన్న రైతులను ఉద్యానవనశాఖ సహకారంతో కంపెనీలు ఎంపిక చేయాలని, కంపెనీలు వారికి కేటాయించిన ప్రాంతాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రైతులకు మేలైన ఆయిల్‌పామ్‌ మొక్కలను సరఫరా చేసే బాధ్యత కూడా కంపెనీలదేనని, వీలైనంత త్వరగా ఆసక్తిగల రైతులకు మొక్కలు అందించాలని, ఈవిషయంలో ఆయిల్​ ఫెడ్​ కంపెనీలకు సహకారం అందించాలని మంత్రి సూచించారు.

Advertisement

Next Story