- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనూసూద్ ఆ పని చేస్తాడనే దుష్ప్రచారం: మంత్రి కేటీఆర్
దిశ, శేరిలింగంపల్లి: లాక్‌డౌన్ సమయంలో నటుడు, రియల్ హీరో సోనూసూద్ చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేనివని, ఆయనకు అందరూ రుణపడి ఉంటారని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం మాదాపూర్ హెచ్‌ఐసీసీలో నటుడు సోనూసూద్‌తో కలిసి కొవిడ్-19 వారియర్స్‌కు.. తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే కొందరు అతనిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే సోనూసూద్‌పై ఐటీ, ఈడీ దాడులు చేయించారని, చివరకు అతని వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం కూడా చేశారని విమర్శించారు.
సోనూసూద్ ఓ రియల్ హీరో అని ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. సోనూసూద్‌కు తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు కేటీఆర్. కొవిడ్ కష్టకాలంలో సోనూసూద్ తన సేవాభావాన్ని చాటుకున్నారని, తన పని, సేవతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారన్నారు. విపత్తు సమయాల్లో ప్రభుత్వమే అన్నీ చేయలేదని, స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతో అవసరమన్నారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేయడం చాలా సులభమని, బాధ్యతగా సేవ చేయడమే గొప్ప అన్నారు.
అనంతరం సోనూసూద్ మాట్లాడుతూ.. కొవిడ్‌తో ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారన్నారు. వాళ్లకు సహాయపడడమే తన ముందున్న సవాల్ అన్నారు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు సహాయ కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తుచేశారు. కేటీఆర్ లాంటి నాయకుడు ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉండదన్నారు. ప్రతీ ఒక్కరు తమకు తోచినంతలో ఎదుటివారికి సహాయపడాలని పిలుపునిచ్చారు సోనూసూద్. ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ప్రతినిధులు, ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కొవిడ్ వారియర్స్ పాల్గొన్నారు.
- Tags
- minister Ktr