- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెల్దీగా ఉన్నా: మంత్రి కేటీఆర్
దిశ, కరీంనగర్: తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం సిరిసిల్ల టూర్‌లో జలుబు, తుమ్ములతో మంత్రి బాధ పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు మంత్రిని ఉద్దేశిస్తూ కరోనా కట్టడిలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. మా ఆరోగ్యం గురించే కాదు.. మీ హెల్త్ గురించి పట్టించుకోండి. ఆరోగ్యం కుదుటపడే వరకు రెస్ట్ తీసుకోండి అంటూ పలువురు ట్విట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్ తాను హెల్దీగా ఉన్నట్లు స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా అలర్జీతో కూడిన జలుబుతో బాధ పడుతున్నానని, హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు వస్తున్న క్రమంలో రోడ్డుమార్గంలో అలర్జీతో కూడిన జలుబు సమస్యలు వచ్చాయన్నారు. అయితే ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్‌ను రద్దు చేసుకుంటే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే, అసౌకర్యం కలిగినప్పటికీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు.