‘కోమటిరెడ్డి సోదరులను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు’

by Shyam |
Minister Jagadish Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: కోమటిరెడ్డి సోదరులపై మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శించారు. అన్నాదమ్ములిద్దరూ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విజ్ఞత ఉంటే.. ఇకనుంచైనా అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. లేదంటే మునుగోడు నియోజకవర్గ ప్రజలే తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు.

Advertisement

Next Story