- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ నగరంలో లేని విధంగా వరంగల్‌కు మంచినీరు : ఎర్రబెల్లి
దిశ ప్రతినిధి వరంగల్: దేశంలో ఏ నగరంలో లేని విధంగా మంచినీటిని వరంగల్‌కు అందజేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనవరి 4న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వరంగల్‌కు రానున్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకు స్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్‌లోని తన క్యాంపు కార్యాలయం అర్ అండ్‌బి అతిథి గృహంలో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి సమీక్షించారు. అధికారులతో కలిసి ఆయా పనులను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది నుంచి వరంగల్‌లో ప్రతి ఇంటింటికీ మంచినీటిని ప్రతి రోజూ ఇవ్వాలన్న నిర్ణయంలో భాగంగా 45వేల కొత్త కనెక్షన్లకు గాను ఇప్పటికే ఇచ్చిన కనెక్షన్లు పోను ఇంకా, 24వేల కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. వాటికి సరపడా మెన్, మెటీరియల్, ఇతరత్రా మౌలిక అవసరాలన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. రూ.1 కే కనెక్షన్ కింద ప్రతి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, మంచినీరు అందించే విధంగా పైపు లైన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంచినీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యుఎస్ లేదా మిషన్ భగీరథల నుంచి ఉద్యోగులను డిప్యూట్ చేసుకోవాలని సూచించారు. నగరంలో ఇటీవలి వరదలకు కొట్టుకుపోయిన, చెడిపోయిన రోడ్ల మరమ్మతుల కోసం పంచాయతీరాజ్, ఐటీడిఎ శాఖల ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లను డిప్యూట్ చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. అమృత్ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.150 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల నిధుల కింద ఇప్పటి వరకు రూ.170 కోట్లను మనమే వ్యయం చేసినట్లు తెలిపారు. అలాగే, ఒక్క మిషన్ భగీరథ పథకం కిందే గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థలో ఇప్పటి వరకు 1000 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు.