వాట్సప్ మెసెజ్‌లే ప్రాణం తీశాయా ?

by Sridhar Babu |   ( Updated:2021-03-11 01:50:28.0  )
వాట్సప్ మెసెజ్‌లే ప్రాణం తీశాయా ?
X

దిశ,వెబ్ డెస్క్: ప్రేమించాలని వేధిస్తూ రోజూ వాట్సప్‌లో మెసెజ్‌లు పెట్టడంతో మానసికంగా కుంగిపోయి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. జ్యోతి ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. రోజూ బస్సులో కాలేజీకి వెళ్తుంది. అయితే ఇదే గ్రామానికి చెందిన ఎర్రం గణేష్ తల్లిదండ్రులు మరణించగా.. నానమ్మ దగ్గర ఉంటున్నాడు. నిత్యం కాలేజీకి వెళ్లివస్తున్న జ్యోతిని ప్రేమించాలని వేధిస్తూ.. వాట్సప్‌లో మెసెజ్ చేస్తుండేవాడు. దీంతో ఈ విషయాన్ని యువతి తన అన్నయ్య శ్రీనివాస్‌కు చెప్పింది. శ్రీనివాస్ మందలించినా కూడా గణేష్ వేధించడం మాత్రం మానలేదు. దీంతో మానసికంగా కుంగిపోయి ఈ రోజు ఉదయం తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story