- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దారుణ ఘటన.. ఆ పురాతన పాఠశాలలో 751 అస్థిపంజరాలు
దిశ, వెబ్‌డెస్క్: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో గత నెలలో ఓ పురాతన గురుకుల పాఠశాలలో 215 అస్థిపంజరాలను గుర్తించిన విషయం మరువక ముందే.. అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. సస్కాచ్వన్ ప్రావిన్స్‌లోని పురాతన పాఠశాల మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్స్కూల్లోఏకంగా 751 అస్థిపంజరాలను గుర్తించారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘కామ్‌లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్’ ప్రాంగణంలో గత నెల ఒకేసారి 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడ్డాయి. రాడార్ ద్వారా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు దేశవ్యాప్తంగా ఇతర మూసివున్న రెసిడెన్షియల్ స్కూళ్లపై దృష్టిసారించారు. ఈ క్రమంలో కొవెస్సెస్ ఫస్ట్ నేషన్ ప్రాంతంలోని ‘మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్’ ప్రాంగణంలో రాడార్ గాలింపు చర్యలు చేపట్టగా వందలకొద్దీ సమాధులను గుర్తించారు. ఇందులో దాదాపు 600 మందికి పైగా చిన్నారుల సమాధులు వెలుగుచూశాయి. దీంతో తవ్వకాలు చేపట్టి పిల్లల అవశేషాలను బయటకు తీస్తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాల 1899 నుంచి 1997 మధ్య రోమన్ కాథలిక్ చర్చి ఆధ్వర్యంలో నడిచింది.
UPDATE: Over 750 unmarked graves were found at a former forced assimilation school for Indigenous children in Saskatchewan, Canada.
The Catholic Church running the Marieval school removed the headstones. Experts believe over 10,000 children died in such schools across Canada. pic.twitter.com/8wk51sHIU1
— AJ+ (@ajplus) June 24, 2021
1970 వరకు కెనడాలో చిన్నారులను క్రిస్టియన్ స్కూళ్లలో బలవంతంగా చేర్చినట్లు తెలిసింది. ఈ పాఠశాలల్లో అత్యధికం రోమన్ కాథలిక్ మిషనరీ ఆధ్వర్యంలోనే నడిచేవి. ఒకప్పుడు ఇక్కడి పాఠశాలల్లో బలవంతపు మత మార్పిళ్లు జరిగేవనీ, మాట విననివారిని తీవ్రంగా కొట్టేవారని అక్కడి వారంటున్నారు. చిన్నారులపై శారీరక, లైంగిక వేధింపులు జరిగాయని కెనడా ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇలాంటి చర్యల వల్ల కనీసం ఆరు వేల మంది చనిపోయి ఉంటారని ఒక అంచనా. కెనడాలో పిల్లలపై విద్యాసంస్థల్లో దారుణాలు జరిగాయంటూ నిజనిర్ధారణ కమిషన్ నివేదిక విడుదల చేసింది.
చిన్నారులను పట్టించుకోకపోవడంతోనే కనీసం 3200 మంది పిల్లలు చనిపోయి ఉంటారని, ఒక్క కామ్‌లూప్స్ పాఠశాలలోనే 1915-1963 మధ్య 51 మరణాలు చోటు చేసుకుని ఉండవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అయితే ఈ ఆశ్రమ పాఠశాలల్లో అంతకుమించిన స్థాయిలో ఏదో ఘాతుకం జరిగినట్లు తాజా పరిణామాలు చాటుతున్నాయి. తాజా ఘటనలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మారివల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో చిన్నారుల అస్థిపంజరాలు బయటపడిన వార్త విని నా గుండె బద్దలైంది. ఇది తీవ్ర విచారకరం. ఈ దారుణాల వెనుక వాస్తవాలను మేం బయటపెడతాం’ అని ఆయన ట్వీట్ చేశారు.