పోటీపడి జల విద్యుదుత్పత్తి.. అడుగంటుతున్న శ్రీశైలం జలాలు

by Jakkula Mamatha |
పోటీపడి జల విద్యుదుత్పత్తి.. అడుగంటుతున్న శ్రీశైలం జలాలు
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీశైలం జలాశయం(Srisailam reservoir) నుంచి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) పోటీ పడి జల విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రోజూ 40 వేల క్యూసెక్కులు వాడుకుంటుండటంతో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215TMC లు కాగా ప్రస్తుతం 149TMCలే మిగిలి ఉన్నాయి. వచ్చే వర్షాకాలం వరకు సాగు, తాగు అవసరాల కోసం నీటిని సంరక్షించాలని కృష్ణా బోర్డు లేఖ రాసినా AP, TG పట్టించుకోవట్లేదు. ఇలాగే కొనసాగితే నీటి కటకట తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed