‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆసక్తికర పోస్టర్ విడుదల చేసిన మేకర్స్

by Hamsa |
‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’  రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆసక్తికర పోస్టర్ విడుదల చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవల ‘పొట్టేల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ప్రజెంట్ అనన్య, వెన్నెల కిషోర్(Vennela Kishore) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీకాకుళం Sherlock Holmes’.

దీనిని మోహన్(Mohan) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని శ్రీ గణపతి సినిమాస్(Sri Ganapathi Cinemas), వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ వెన్నపూస రమణారెడ్డి(Ramana Reddy), వంశీ నందిపాటి నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమాలో ఎవరెవరో నటిస్తున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’(Srikakulam Sherlock Holmes) మనోడు చంటబ్బాయి తాలూకా మూవీ విడుదల తేదీని ప్రకటిస్తూ వెన్నెల కిషోర్ పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్. అయితే ఈ చిత్రం డిసెంబర్ 25న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రజెంట్ వెన్నెల కిషోర్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.

Next Story

Most Viewed