- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pushpa-2: విడుదలకు ముందే పుష్ప-2 రికార్డుల మోత.. బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘పుష్ప ది రూల్’(Pushpa The Rule) పేరే వినిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న పుష్ప-2 కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిన్న (నవంబరు 24) చెన్నై(Chennai)లో ఈవెంట్ నిర్వహించి.. ఐటెమ్ సాంగ్ లాంచ్ చేశారు. ఇందులో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు.
పుష్ప-2 టీమ్ నిర్వహిస్తోన్న ఈవెంట్స్‌తో సినిమాపై మరింత హైప్ పెంచేస్తున్నాయి. దీంతో పుష్ప సెకండ్ పార్ట్‌తో అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికి వెళ్లనుందో అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక 27 వ తేదీన కేరళ(Kerala)లోని కొచ్చి(Kochi)లో గ్రాండ్ హయత్(Grand Hyatt)లో ఈ చిత్ర ఈవెంట్‌ను నిర్వహించనున్నారట. ఈసారి కేరళలో పుష్ప 2 సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు.
డిసెంబరు 5 వ తేదీన థియేటర్లలో సందడి చేయనున్న ఈ మూవీ ఇప్పటికే ప్రీసేల్ బుకింగ్స్(Presale bookings)లో పలు రికార్డులు కొల్లగొట్టింది. తాజాగా బన్నీ నటిస్తోన్న బ్లాక్ బస్టర్ చిత్రం మరో ఘనత సాధించింది. ఓవర్సీస్(Overseas)లో ఇప్పటివరకు 50 వేల టికెట్స్ సేల్ అయినట్లు నిర్మాణసంస్థ వెల్లడించింది. ‘పుష్ప రాజ్(Pushpa Raj) అంటే చరిత్రను సృష్టించడమే కాదు.. వరల్డ్ వైడ్‌గా తన పాలన గురించి చర్చించుకునేలా చేస్తాడు’ అంటూ ఓ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.