CM Revanth Reddy : స్కిల్ యూనివర్సిటీకి ఆదాని నిధులు నిరాకరణ : సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |
CM Revanth Reddy : స్కిల్ యూనివర్సిటీకి ఆదాని నిధులు నిరాకరణ : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ(Young India Skill University) గౌతమ్ ఆదాని(Goutham Adani) ఇచ్చిన రూ.100 కోట్ల నిధులను తీసుకునేందుకు నిరాకరిస్తున్నామని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆదాని గ్రూప్ పై రేగుతున్న దుమారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రిగా నాకు, మా మంత్రి వర్గానికి లేనిపోని వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేదని.. అందుకే ఆదాని గ్రూప్ కు వారి నిధులు తీసుకోవడం లేదని లేఖ రాశామని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతకు అంతర్జాతీయస్థాయి స్కిల్స్ నేర్చుకోడానికి ఎంతో ముందుచూపుతో స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పామని, దానికి సీఎస్ఆర్ నిధుల కింద ఏ కంపెనీ అయినా నిధులు అందివ్వవచ్చు అని వెల్లడించారు. అదేవిధంగా ఆదాని ఇస్తే తీసుకున్నామని, అది మా ఇంట్లోకి ఇచ్చింది కాదని.. రాష్ట్ర యువత కోసం ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed