- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను స్కామ్‌లో ఉన్నట్టు నిరూపిస్తే.. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా: బాలినేని శ్రీనివాసరెడ్డి
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. వైసీపీ(YCP) నేత చెవిరెడ్డి కి సవాల్ విసిరారు. భారత పారిశ్రామికవేత్త అదానీ(Adani) పై అమెరికాలో కేసు నమోదు కావడంతో.. ఈ వ్యవహారంలో మాజీ సీఎం జగన్ పేరు బయటకు వచ్చింది. వైసీపీ హయాంలో ఏపీ ప్రభుత్వం, అదానీ(Adani)తో విద్యుత్ ఒప్పందాలకు.. వైఎస్ జగన్(YS Jagan)కు లంచం ఇచ్చారనే వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదే విషయంపై గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivasa Reddy) చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. కాగా ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి(Chevireddy Bhaskara Reddy) స్పందించారు. వైఎస్ జగన్‌ను తిడితే జనసేనలో మెచ్చుకుంటారనే ఉద్దేశంతో బాలినేని ఇలా..దిగజారి మాట్లాడుతున్నారన్నారని ఫైర్ అయ్యారు. బాలినేని ఇంతలా దిగజారిపోతారని ఊహించలేదని.. ఎమ్మెల్సీ పదవి కోసం బాలినేని ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు.
కాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. చెవిరెడ్డికి సవాల్ విసిరారు. తాను విద్యుత్ స్కామ్‌లో ఉన్నట్టు నిరూపిస్తే.. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై చెవిరెడ్డికి ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సెకీ తో ఒప్పందం అంశంలో నాకు సంబంధం లేదని, నాకు వైఎస్సార్ రాజకీయ భిక్ష పెట్టినట్టు..జనసేనలో చేరినప్పుడే చెప్పానని.. ఎవరి మెప్పు కోసమో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదని.. వైఎస్సార్ కుటుంబం అంటే జగన్ ఒక్కడే ఉన్నారా.. విజయమ్మ, షర్మిల వైఎస్ కుటుంబం కాదా అంటూ మాజీ మంత్రి బాలినేని ప్రశ్నించారు. అలాగే వైఎస్ఆర్ కుటుంభ సభ్యులపై అసభ్యకర పోస్ట్‌లు పెడితే పట్టించుకోరా అంటూ ఈ సందర్భంగా బాలినేని ప్రశ్నించారు.