డాటా ఎంట్రీని వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

by Kalyani |
డాటా ఎంట్రీని వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
X

దిశ, ప్రతినిధి వికారాబాద్ : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డాటా ఎంట్రీని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్, వికారాబాద్ మండల ఎంపీడీవో కార్యాలయంలో డాటా ఎంట్రీ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాటా ఎంట్రీకి సంబంధించి ఆపరేటర్లను అధికంగా నియమించుకొని డాటా ఎంట్రీని వేగవంతం చేయాలని ఆయన సూచించారు. డాటా ఎంట్రీ గాను అదనంగా కలెక్టరేట్ నుంచి కంప్యూటర్లను పొందాలని కలెక్టర్ తెలిపారు. డాటా ఎంట్రీ ప్రక్రియ ఒకే గదిలో నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ కు కలెక్టర్ సూచించారు. అంతకు ముందు వికారాబాద్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి డార్మెంటరీ, వంటగది, భోజనశాలలో విద్యార్థినిలకు వడ్డించే భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు.

ప్రజావాణికి మొత్తం 113 దరఖాస్తులు..

ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం కల్లెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుదీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి లతో కలిసి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 113 దరఖాస్తులు రాగా, స్వీకరించిన వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే సత్వరమే పరిష్కరించారు. వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వాసుచంద్ర, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story