- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించాలి.. అదనపు కలెక్టర్
దిశ, ఘట్కేసర్ : రెసిడెన్షియల్, వెల్పేర్ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని వార్డెన్లను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఘట్ కేసర్ మండలంలోని ప్రభుత్వ బీసీ కాలేజీ బాలుర హాస్టల్, ఎస్సీ కాలేజీ బాలుర హాస్టల్, ఎస్సీ బాలుర హాస్టల్, ఎస్సీ కాలేజీ బాలికల హాస్టల్, ప్రభుత్వ బీసీ కాలేజీ, ప్రభుత్వ గిరిజన బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్, మేడిపల్లి మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే, బీసీ వెల్ఫేర్ బాలుర రెసిడెన్షియల్ స్కూల్, టీఎంఆర్ఎస్ మల్కాజిగరి బాలికల స్కూళ్లను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ హాస్టళ్లలోని విద్యార్థులకు పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించాలని, అంతే కాకుండా వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. స్కూలులోని వంట శాలను, స్టోర్ రూంను కలియ తిరిగి పరిశీలించారు. స్టోర్ రూంలోని వంట సామాగ్రిని పరిశీలించి తడి లేకుండా సామాగ్రిని నిల్వ ఉంచాలని అదనపు కలెక్టర్ స్టోర్ ఇంఛార్జిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖాధికారి వినోద్ కుమార్, మేడిపల్లి తహశీల్దారు హసీనా, తదితరులు పాల్గొన్నారు.