- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. ఎమ్మెల్యే
దిశ, తిరుమలగిరి : పేద ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం రసూల్ పురలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, సీబీఎన్ నగర్లోని బస్తీ దవాఖానాలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితుల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో స్థానిక ప్రజల ఫిర్యాదులతోనే ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రిలోని సిబ్బంది నిర్లక్ష్యం పట్ల వారిని తీవ్రంగా హెచ్చరించారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా సిబ్బంది లేకపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ హాజరు పట్టికను తనిఖీ చేశారు. బస్తీ దవాఖానలో మెడికల్ ఆఫీసర్ లేకపోవడం, హెల్త్ సెంటర్ లో వైద్యులు, సిబ్బంది లేకపోవడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పై అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. బస్తీ దవాఖానాలలో, హెల్త్ సెంటర్లలో సిబ్బంది హాజరు నమోదు చేయడానికి అన్నిచోట్ల బయోమెట్రిక్ సిస్టమ్ ఏర్పాటు చేసేలా ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడతానని అన్నారు. స్థానిక ప్రజల ఫిర్యాదులతోనే ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే ఉపేక్షించేది లేదని సంబంధిత వైద్య అధికారులను, సిబ్బందిని ఆయన హెచ్చరించారు.