- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయండి.. డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్
దిశ ప్రతినిధి, కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు అయ్యేలా చూడాలని కోరుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ కన్వీనర్ సీమకుర్తి రామకృష్ణ, కో-కన్వీనర్ అఫ్జల్ పఠాన్ వినతి పత్రం అందించారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో, చానళ్ళలో రిపోర్టర్లుగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారన్నారని, అందులో చాలా మంది పేదరికంతో ఉన్న కుటుంబాలే ఎక్కువగా ఉండగా కనీసం సొంత ఇల్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టులు సతమతమవుతున్నారన్నారు.
సొంత ఇల్లు లేని జర్నలిస్టులకు అద్దె చెల్లించడం భారంగా మారిందని, గత ప్రభుత్వం కొత్తగూడెం జర్నలిస్ట్ ల కోసం స్థలాన్ని సేకరించినప్పటికీ ఆ స్థలాన్ని సొసైటీకి అప్పగించడంలో జాప్యం చేసిన విషయాన్ని మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, ఇళ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఇందిరమ్మ రాజ్యంలోనైన జిల్లాలో అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వెంటనే వారికి ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ తరపున విన్నవించారు.