రైతులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం

by Kalyani |
రైతులకు అండగా ఉంటాం  : మంత్రి పొన్నం
X

దిశ, కమలాపూర్: వరి సన్నాలకు ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇస్తుందని, రైతులకు అండగా ఉంటామంటూ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సోమవారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కమలాపూర్ మండల మార్కెట్ కమిటీ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా తౌటం ఝాన్సీ రవీందర్, వైస్ చైర్మన్ గా ఐలయ్య, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించగా ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు రైతు భరోసా పై కొండలు, గుట్టలు, ప్లాట్లకు కాకుండా సబ్ కమిటీ వేసి నిజమైన రైతులను గుర్తించి రైతు భరోసా కల్పిస్తోందని తెలిపారు. కమిటీ నివేదిక రాగానే రైతులకు రైతు భరోసా కల్పిస్తామన్నారు. రుణమాఫీ రెండు లక్షల పైన ఉన్న వారికి ఆ పైన డబ్బులు కడితే రెండు లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, 11 నెలల్లో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story