Aaditya: శివసేన (యూబీటీ) శాసనసభా పక్ష నేతగా ఆధిత్య థాక్రే.. ఏకగ్రీవంగా ఎన్నిక

by vinod kumar |
Aaditya: శివసేన (యూబీటీ) శాసనసభా పక్ష నేతగా ఆధిత్య థాక్రే.. ఏకగ్రీవంగా ఎన్నిక
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన(UBT) శాసనసభా పక్ష నేతగా ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య థాక్రే (Aaditya Thakrey) నియామకయ్యారు. ముంబైలో సోమవారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ సీనియర్ నేత అంబాదాస్ దన్వే (Ambadas dhanve) తెలిపారు. అలాగే మరో ఎమ్మె్ల్యే సునీల్ ప్రభు(Sunil Prabhu)ను చీఫ్ విప్‌గా నియమించారు. రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ గ్రూప్ లీడర్‌గా మాజీ మంత్రి భాస్కర్ జాదవ్ ఎన్నికయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిత్య వర్లీ నియోజకవర్గం నుంచి షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన మిలింద్ దేవరాపై 8,801 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలోనే శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే తమ ఎమ్మెల్యేలను ఐదేళ్లపాటు ఐక్యంగా ఉంచడం ఆధిత్యకు సవాల్‌గా మారనుంది. ఎందుకంటే ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు షిండేతో టచ్‌లో ఉన్నట్టు ఇటీవల ఓ నాయకుడు ప్రకటించారు. దీంతో ఉద్థవ్ వర్గం అప్రమత్తమైంది. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన(యూబీటీ)కి భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కేవలం 20 సీట్లు మాత్రమే గెలుచుకుని ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Advertisement

Next Story