Tirumala:శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన.. విచారణ ముమ్మరం చేసిన సిట్

by Jakkula Mamatha |
Tirumala:శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన.. విచారణ ముమ్మరం చేసిన సిట్
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కల్తీ నెయ్యి వివాదంపై సిట్ విచారణ సాగుతోంది. ఈ మేరకు తిరుమలలో రెండు రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు సీబీఐ(CBI) అధికారులతో కలిసి ఇటీవల సిట్ ఏర్పాటు చేశారు. సీబీఐ అధికారుల పర్యవేక్షణలో ఈ విచారణ కొనసాగుతోంది. అయితే అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు(Tamil Nadu) దిండిగల్‌లో ఉన్న 11 మంది సిట్ స‌భ్యులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఏఆర్ డెయిరీలో సిట్ బృందం సభ్యులు వివరాలు సేకరించారు. తిరుపతిలోని టీటీడీ(TTD) మార్కెటింగ్ గోదాములను పరిశీలించారు. నెయ్యి కొనుగోలు టెండర్ల దస్త్రాల పై ఆరా తీశారు. తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా సిట్ విచారణ జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story