- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఫీస్ టైమ్‌లో తినాల్సిన హెల్తీ ఫుడ్స్ ఇవే!
దిశ, ఫీచర్స్: ప్రస్తుత బిజీ కాలంలో సమయానికి తినకుండా ఆఫీసుల్లో ఉద్యోగాలే జీవితంగా చాలామంది పనిచేస్తుంటారు. ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినా మెదడుకు మాత్రం ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల నుండి ప్రభుత్వం ఉద్యోగుల వరకు చాలామంది నిత్యం కుర్చీలకే పరిమితమై పని చేస్తుంటారు. మరికొందరు ఆఫీస్ వర్క్ చేసే ప్రదేశంలోనే కూర్చున్న చోటే భోజనం చేస్తుంటారు. అలా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. శారీరక శ్రమ లేకపోవడంతో పాటుగా 8 లేదా 10 గంటల పాటు అలాగే కంప్యూటర్ల ముందు కూర్చుని, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి వారు తప్పనిసరిగా ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పనిలో పడి సరైన సమయానికి ఆహారం తినకపోతే గుండెజబ్బు, బీపీ, షుగర్, నరాల బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నట్స్: ఎక్కువ సమయం ఆఫీస్‌లో పనిచేసే వారు విరామ సమయంలో నట్స్, మొలకలు లేదా ఉడకబెట్టిన ధాన్యాలు వంటివి తినడం మంచిది. వీటిని తినడం వల్ల ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుంది.
పండ్లు: ఆఫీసుకు వెళ్లే వారు మధ్య మధ్యలో పండ్లు తీసుకోవడం మంచిది. ద్రాక్ష, జామ, అరటి, కమల వంటి పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. రోజంతా నీరసం రాకుండా, అలసి పోకుండా ఉండేందుకు ఇవి సహాయపడతాయి.
గ్రీన్ టీ: ఒకేచోట కూర్చుని పనిచేసే వారికి గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పాలిఫెనాల్స్ శరీరాన్ని అసలిపోకుండా చేస్తుంది. దీనిని అధిక మొత్తంలో కాకుండా రోజుకి రెండు లేదా మూడు కప్పులు తాగడం మంచిది.
ఓట్స్ మీల్: వెంటనే తయారు చేసుకుని తినలేకపోయిన వారు ఓట్స్ మీల్ వంటి ఆహార పదార్ధాలను తీసుకెళ్లి తినడం మంచిది. డ్రై ఫ్రూట్స్ ఉన్న ఓట్స్ తీసుకుంటే ఆకలి తీరుతుంది. అంతేకాకుండా బరువు పెరగకుండా ఉండడానికి తోడ్పడుతుంది.
నీళ్ళ : ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే, పనిచేసే ప్రదేశంలో డెస్క్‌పై నీళ్ల బాటిల్ పెట్టుకొని నీళ్లు తాగండి. తరచుగా నీళ్లు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేష్‌గా ఉంచుకోవచ్చు. నీళ్లు తాగడం వల్ల మరింత చురుకుగా పనిచేస్తారు. అంతేకాకుండా ఇది కిడ్నీ, మలబద్ధకం, కండరాల సమస్యలు రాకుండా సహాయపడుతుంది.
వర్క్ చేస్తున్నవారు మధ్యాహ్నం భోజనంలో జంక్‌ఫుడ్ తినకపోవడమే మంచిది. చాలామంది లంచ్ టైమ్‌లో జంక్‌ఫుడ్‌ని ఎక్కువగా తింటుంటారు. అలా ప్రతి రోజూ తినడం వల్ల ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.