BB Telugu 8 Winner: బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ వీరేనట?

by Anjali |
BB Telugu 8 Winner: బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ వీరేనట?
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున(Nagarjuna) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 (BB Telugu 8 Winner) అట్టహాసంగా సాగుతోంది. ఈ సీజన్ చివర దశకు చేరుకుంటోంది. దీంతో కంటెస్టెంట్లు పోటాపోటీగా ఆడుతున్నారు. గ్రాండ్ ఫినాలేకు మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే విన్నర్ ఎవరు? అనే అనుమానాలు కూడా అందరిలో వ్యక్తం అవుతున్నాయి. కామన్‌గా అయితే హౌస్‌లో ఎవరైతే బాగా ఆడి మెప్పిస్తారో వారే విన్నర్‌గా నిలుస్తారు. మరీ ఈసారి కప్పు కొట్టే కంటెస్టెంట్ ఎవరో కూడా క్లారిటీ వచ్చేసిందంటూ బిగ్‌బాస్ ప్రియులు అంచనా వేస్తున్నారు.

నిఖిల్(Nikhil) అండ్ గౌతమ్(Gautham) మధ్య పోటీ వేడివేడిగా సాగుతోంది. అయితే గౌతమ్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి కప్పు కొట్టే అవకాశం లేదని నెటిజన్లు తమ అభప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ గేమ్ పరంగా చూసుకుంటే మాత్రం టైటిల్ విన్నర్ ఇవ్వాలంటున్నారు. చేయలేని సమయంలో అలాంటప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గత సీజన్లో కూడా అర్జున్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వచ్చాడు కాబట్టి విన్నర్ రేస్ లో ఉన్న తప్పించారని టాక్. అయితే ఈసారి కూడా గౌతమ్ పరిస్థితి అదేనంటున్నారు. ఇక అందుకే నిఖిల్ బిగ్‌బాస్ సీజన్- 8 విన్నర్‌ అవ్వనున్నాడని టాక్ వినిపిస్తుంది. మరీ ఎవరు కప్పు కొడుతారనేది మూడు వారాలు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story